శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని హఫీజ్ పేట సర్వే నెంబర్ 151 రేగుల కుంట ప్రభుత్వ భూమి కబ్జాపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి జనవరి 28, 2026న ఇచ్చిన ఫిర్యాదుకు హెచ్ఎండీఏ స్పందించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11, 2026న రేగుల కుంట చెరువు జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుందని, వెంటనే తగిన చర్యలు తీసుకొని కాపాడాలని లేఖ రాసింది. జిహెచ్ఎంసి కమిషనర్ కు లేఖ రాసిన విషయాన్ని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డికి లేఖ ద్వారా హెచ్ఎండిఏ తెలియజేసింది.





