అన్ని విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బంది క‌ల‌సి ప‌నిచేయాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పిలుపుమేరకు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు చేపట్టిన వర్షాకాల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, డీసీ గంగాధర్, AMOH శ్రీనివాస్, జీహెచ్ఎంసీ అన్ని విభాగాల అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అన్ని విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బంది మాన్‌సూన్ స్పెష‌ల్ డ్రైవ్‌లో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ పాల్గొనాల‌ని అన్నారు. అవ‌స‌రం ఉన్న చోట ఇంటెన్సివ్ శానిటేష‌న్ డ్రైవ్‌లు చేప‌ట్టాల‌ని, యాంటీ లార్వా స్ప్రేయింగ్ ప‌నులు చేయాల‌ని, సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌కు కృషి చేయాల‌ని అన్నారు. పారిశుధ్య ప‌నుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని, దోమ‌ల అభివృద్ధిని అరిక‌ట్టాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ ప‌రిశుభ్ర‌త పాటించేలా అవగాహ‌న క‌ల్పించాల‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిఎచ్ఎంసి అధికారులు ఇఇ గోవర్ధన్ గౌడ్, ఎఎంఒఎచ్ శ్రీనివాస్, ఎసిపి జిషాణ్, యూబిడి మేనేజర్ మనోహర్ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ Dr. దీపాంకర్ పాల్, పిఓ రాజశేఖర్, సిఓ ముస్తఫా, ఎస్ఆర్పి ఎ. సత్యనారాయణ, డిఇ రమేష్, ఇంజినీరింగ్ విభాగం ఎఇ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, ఎంటమాలజి ఎఇ తేజ శ్రీ, ఎంటమాలజి సూపర్వైజర్ డి.నరసింహులు, యూబిడి సూపర్వైజర్ నాగ రాణి, టిపీఎస్ మధు, ఎన్ఎసి విశ్వనాథ్, జిఎచ్ఎంసి విభాగాల సిబ్బంది, నాయకులు ,కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here