జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపును ఎవ‌రూ ఆప‌లేరు: క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర రావు

మియాపూర్‌‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపును ఎవ‌రూ అడ్డుకోలేర‌ని ఆ పార్టీ మియాపూర్ డివిజ‌న్ అభ్య‌ర్థి క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర రావు అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని ఎంఏ న‌గ‌ర్‌లో శుక్ర‌వారం ఆయ‌న ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు.

క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేయాల‌ని వృద్ధురాలిని కోరుతున్న క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర రావు
ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర రావు

ఈ సంద‌ర్భంగా కర్లపూడి రాఘవేంద్ర రావు మాట్లాడుతూ బీజేపీతోనే సుస్థిర అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. తెరాస ప్ర‌భుత్వం ఇన్నేళ్ల స‌మ‌యంలో న‌గ‌రంలో చేసిందేమీ లేద‌న్నారు. ప్ర‌తి ఏటా న‌గ‌రంలో వ‌ర్షాకాలంలో జ‌నాలు ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నా తెరాస ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉంద‌ని ఆరోపించారు. న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా గుంత‌లు ప‌డ్డ రోడ్లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయ‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు పోవాలంటే బీజేపీ అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని అన్నారు.

క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేయాల‌ని మ‌హిళ‌ను కోరుతున్న క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర రావు
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here