మురుగునీటి పైపుల సమస్య పరిష్కారం.. అధికారులకు అలావుద్దీన్ పటేల్ కృతజ్ఞతలు

శేరిలింగంపల్లి, జూలై 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అడ్డుపడిన మురుగునీటి పైపులైన్లను విజయవంతంగా క్లియర్ చేసి స్థానిక ప్రజలకు ఉపశమనం కల్పించిన హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల సకాల స్పందన, అంకితభావంతో చేసిన కృషి వల్ల మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. దీంతో స్థానిక నివాసితులకు ఎంతో ఉపశమనం కలిగిందని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకున్నందుకు హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఇదే విధమైన చొరవను అధికారులు కొనసాగించాలని మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here