శేరిలింగంపల్లి, జూలై 27 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మియాపూర్ సర్కిల్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం2 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి 2 వినతులు నమోదు కాగా, రెవెన్యూ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, యూసీడీ, ఇంజినీరింగ్, యూబీడీ, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, వెటర్నరీ తదితర విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అధికారులు ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.






