SIR కార్యక్రమంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, జూలై 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision-SIR) కార్యక్రమంలో ప్రతి ఓటరు, ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక నాయకులతో కలిసి నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటుకు ఎంతో విలువ ఉందన్నారు. SIR కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు సయ్యద్ గౌస్, కున్యా నాయక్, డివిజన్ అధ్యక్షుడు నగేష్ నాయక్, లోక్య నాయక్, వెంకటేష్, సుమన్ నాయక్, రాజ్ కుమార్, రఘు, చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here