గచ్చిబౌలి, అక్టోబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందుకు ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా నవోదయ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అన్నారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను వేయాలని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరచాలని, వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ త్వరలోనే నవోదయ కాలనీలో పర్యటించి మిగిలిన పనులు పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రగడ సత్యనారాయణ, నవోదయ కాలనీ వాసులు వాసు, శేఖర్, రవి, వంశీ, సత్యం, భూపాల్ రెడ్డి, విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
