శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు, ఐఎన్టీయుసీ రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నల్ల సంజీవ రెడ్డి జన్మదినం సందర్భంగా మయూరి నగర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ లో ఉన్న హైదరాబాద్ జిల్లా మహిళా మండళ్ల సమాఖ్య ప్రాంగణంలో శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులతో కలిసి అన్నదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, మన్నేపల్లి సాంబశివ రావు, మోహన్ రెడ్డి, తిరుపతి, ప్రభాకర్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, రాంచందర్, రవి, రెహమాన్, శివ, విష్ణు, శివ కుమార్, వాసు, శంకర్ రావు, మహిళా నాయకులు సంగీత గౌడ్, శ్రీదేవి, అనిత, శశిరేఖ, శ్రీజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






