మండలి రాధాకృష్ణ యాదవ్ కి మైనంపల్లి హనుమంతరావు క్ష‌మాప‌ణ చెప్పాలి: భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూలై 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మండలి రాధాకృష్ణ పై మాటల దాడిని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఆయ‌న‌కు వెంట‌నే క్షమాపణ చెప్పాల‌ని, యాదవులపై, బీసీలపై దాడులు చేస్తే మాటలతో కాదు ఓట్లతో కొడతాం ఖబడ్దార్ అని ఆయ‌న హెచ్చ‌రించారు. మైనంపల్లి హనుమంతరావు యాదవులని, బీసీలను తక్కువ చేసి మాట్లాడితే యాదవులు, బీసీలు ఏకమై రాబోయే ఎలక్షన్లో అగ్రవర్ణాలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. తక్షణమే మైనంపల్లి హనుమంతరావు మండలి రాధాకృష్ణ యాదవ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాల‌న్నారు. అలా జరగని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు ఆయ‌న‌ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని అన్నారు. మైనంపల్లి హనుమంతరావు యాదవుల జోలికి, బీసీల జోలికి రావద్దు ఖబర్దార్ అని హెచ్చరించారు. యాదవులను, బీసీలను చులకనగా చూస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేస్తామని, మాటలతో దాడులు చేయమని ఓటు బ్యాంకుతో పోటు పొడుస్తామని, తిరిగి కోలుకోవడానికి జీవిత కాలం పడుతుందని హెచ్చరించారు. ఏ నాయకుడు కూడా బీసీలతో పెట్టుకోవద్దు అని అనుకునేలా చేస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీసీల ఐక్యత బీసీల పోరాట పటిమ ఏంటో చూపిస్తాం. వచ్చే ఎన్నికల్లో బీసీ నాయకుల ఆగమనం, బీసీల రాజ్యాధికారం తథ్యం అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రేట్ హైదరాబాద్ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి దంతిబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర యాదవ సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here