శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కనకదుర్గ శిష్య బృందం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఝేమ్ ఝేమ్ తనన , బ్రహ్మాంజలి, నమశ్శివాయతే, భజరే నందగోపాలం, పరమపురుషుడు, బాలగోపాలా తరంగం, ఇందరికి భయము, మొదలైన అంశాలను షార్వి, ఉద్విత, తేజస్విని, కృతిక, పర్ణిక, అపేక్ష, అభిజ్ఞ, పరిణీత, వేదశ్రీ, నిత్య, శ్రీనిధి, రిషిక, దీపశిక, లాస్య, ఝాన్సీ , స్రవంతి ప్రదర్శించి మెప్పించారు.