చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి శ్రీవారి ప్రసాదాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిలకు శనివారం అందజేశారు. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మల్లారెడ్డి స్వామివారి కల్యాణం లడ్డును వారికి అందజేశారు. ప్రజలందరికీ కరోనా నుంచి విముక్తి లభించాలని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించాలని శ్రీవారిని వేడుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, టిఆర్ఎస్ నాయకుడు గణేష్ రెడ్డి పాల్గొన్నారు.







