శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని పలువురు బాధితులు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సహాయాన్ని శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధితులకు అందజేశారు. హైదర్ నగర్ డివిజన్ లోని అట్లూరి హర్ష (రూ.7 లక్షలు), చందానగర్ డివిజన్ హుడా కాలనీ సాయి కృష్ణ (రూ.60వేలు), మియాపూర్ డివిజన్ శ్రీనివాస రావు (రూ.34వేలు), జగద్గిరిగుట్టకి చెందిన అలహరి జ్యోతి (రూ.60వేలు), వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వరనగర్ వ్యక్తికి (రూ.32వేలు); చందానగర్ డివిజన్ హుడా కాలనీ రామ్ కుమార్ (రూ.14,500), శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ వాసు (రూ.60వేలు), మాదాపూర్ డివిజన్ వినాయక్ నగర్ సునీత (రూ.20వేలు), జగద్గిరిగుట్ట లక్ష్మణ్ నాయక్ (రూ.8వేలు), కొండాపూర్ డివిజన్ అనురాధ (రూ.36వేలు)లకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన మొత్తం రూ.10,24,500 విలువైన ఎల్వోసీ పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, హైదర్ నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు నార్నె శ్రీనివాస రావు, తెరాస నాయకుడు కోనేరు కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.






