మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ శేరిలింగంపల్లి మైనారిటీ నాయకుడు మహమ్మద్ వజీర్ శనివారం ప్రభుత్వవిప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఏదైనా ఒక డివిజన్ నుంచి తనకు కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ బయోడేటా అందజేశారు. గత మూడు దశాబ్దాలుగా శేరిలింగంపల్లి రాజకీయాల్లో కొనసాగుతు వస్తున్నానని, ముస్లిం మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలతో మెరుగైన సంబంధాలు ఉన్నాయని, తనకు అవకాశం కల్పిస్తే భారీ మెజార్టీతో గెలిచి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. వజీర్ కు మద్దతుగా మియాపూర్ డివిజన్ కు చెందిన పలువురు మైనార్టీ నాయకులు గాంధీని కలిశారు.
