నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణలో మార్పు తథ్యం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అధికారంలోకి వచ్చేది బిజెపినేని స్పష్టం చేశారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ని ప్రసంగించారు. మా పోరాటం ఫలితాన్ని ఇస్తుందన్నారు. కుటుంబ పార్టీల నుంచి విముక్తి లభించాలన్నారు. తెలంగాణ ప్రజల అభిమానమే తన బలమన్నారు. తెలంగాణ ప్రజల ఆప్యాయతకు రుణపడి ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ విమర్శలు సంధించారు. ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమ జరగలేదన్నారు. తెలంగాణను కుటుంబ పాలనలో బంధించాలనుకుంటున్నారన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసే వాళ్లు నాడు.. నేడు ఉన్నారన్నారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ గా చేయాలనుకుంటున్నామని చెప్పారు. యువతతో కలిసి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం అన్నారు. దశాబ్దాలపాటు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో బలిదానాలు జరిగాయన్నారు. ఒక కుటుంబం తెలంగాణ అభివృద్ధిని అణచి వేస్తోందన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. పేదల సమస్యలు కుటుంబ పార్టీలకు పట్టవన్నారు.