నమస్తే శేరిలింగంపల్లి: భర్తతో ఇంటి నుంచి బయటకెళ్లిన భార్య అదృశ్యమైన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాచుపల్లి ఎస్ఐ ఎం. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం బాచుపల్లి నిజాంపేటకు చెందిన పి. మౌనిక తన భర్త ధనుంజయ్ తో శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 3వ తేదీన భర్త ధనుంజయ్ తో కలిసి మౌనిక బయటకెళ్లింది. మౌనిక కనిపించకుండా వెళ్లడంతో ధనుంజయ్ చుట్టు పక్కలా ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో భర్త ధనుంజయ్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు మౌనిక నీలి రంగు చీర, గులాబీ రంగు జాకెట్ ధరించి ఉందని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు 8333993552, 9491060942 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
