శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ (PAC) గా నియమితులైన సందర్బంగా PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ ఆరెకపూడి గాంధీని అభినందించారు. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాక్షించారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు PAC చైర్మన్ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఐటీ, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని గాంధీ అన్నారు.