చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప‌్రజలకు తాజా పండ్లు, కూరగాయలను అందించాల్సిన బాధ్యత వర్తకులపై ఉందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం చందానగర్ డివిజన్ పరిధిలోని మదీనాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలిక్సిర్ హౌస్ (ఫామ్ టు కుక్) ఫ్రూట్స్, వెజిటబుల్స్ 2వ స్టోర్‌ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజలు నిత్యం పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలను తినాలని సూచించారు.
ఎలిక్సిర్ హౌస్ యాజమాన్యం వినియోగదారులకు తాజా అయిన కూరగాయలు, పండ్లను అందించాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. రైతుల నుంచి నేరుగా పండ్లు, కూరగాయలు తెచ్చి వినియోగదారులకు అందజేయడం అభినందనీయమన్నారు. కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజల్లో పౌష్టికాహారం పట్ల శ్రద్ధ పెరగడం ప్రశంసనీయమన్నారు. తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చన్నారు. నిత్యం పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భిస్కర్‌రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు గంగాధర్ రావు, బాలింగ్ గౌతమ్ గౌడ్, రాజు యాదవ్, స్టోర్ నిర్వాహకులు నాగవేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, కబీర్ కౌషల్ తదితరులు పాల్గొన్నారు.