మియాపూర్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో మ‌హిళ మృతి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఓ మ‌హిళ అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన సంఘ‌ట‌న మియాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ర‌వికిర‌ణ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… మియాపూర్ మాధ‌వ‌న‌గ‌ర్ సీబీఆర్ రెసిడెన్సీలో నివాసం ఉండే వంశీ భార్య కృష్ణ నివేదిత(36) న్యూ ఇండియా యాస్యురెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేష‌న్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. కాగా ఆదివారం మ‌ధ్యాహ్నం 2.45 గంట ప్రాంతంలో ఆమె త‌న బెడ్‌రూమ్‌లో ఉరికి వేళాడుతూ క‌నిపించారు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆమెను స్థానిక ఉద్భ‌వ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్టు వైద్యులు దృవీక‌రించారు. బాదితురాలు బంధువులు సోమ‌వారం మియాపూర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. త‌మ బిడ్డ ఆత్మ‌హ‌త్య చేసుకునెంత పిరికి వ్య‌క్తి కాద‌ని, మృతిపై త‌మ‌కు అనుమానం ఉన్న‌ట్టు వారు పేర్కొన్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని గాంధీ ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు.

కృష్ణ నివేదిత (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here