నమస్తే శేరిలింగంపల్లి: కరోన ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో మియాపూర్ డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో నాలుగు వారాలుగా కరోన కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉండవచ్చని అన్నారు. ప్రస్థుత వైరస్ తీరు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు రెట్టింపు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, శానిటైజర్ వాడాలని, అవసరం ఐతే తప్ప బయటకు రావద్ధని సూచించారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా స్వీయ నియంత్రణతోనే వైరస్ కట్టడి సాధ్యమని అన్నారు.
