నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ ప్రధాన రహదారి పై గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఛైర్మెన్ గుడ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం, మజ్జిగ కేంద్రంను కేంద్ర మాజీ మంత్రి వర్యులు సముద్రాల వేణు గోపాల్ చారితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక వైపు ఎండలు మండిపోతుండగా, మరో వైపు కరోనా ఉదృతి కొనసాగుతుందని, ఈ క్రమంలో ప్రజల దాహార్తి తీర్చుకునే అవకాశాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయమని అన్నారు. గుడ్ల ధనలక్ష్మీ ట్రస్టు చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి గతేడాది కరోనాలో వేలాది మంది నిరుపేదల ఆకలి తీర్చిందని, ఇప్పుడు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు రావడం ఇతరులకు స్పూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు దాసరి గోపి కృష్ణ, జనార్దన్ రెడ్డి, నూనె సురేందర్, భవానీ చౌదరి, అక్బర్ ఖాన్, సైదేశ్వర్, సురేందర్, రవి, రాము, జహీర్, వరలక్ష్మి, పార్వతి, భవాని తదితరులు పాల్గొన్నారు.