స్వగ్రామం వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన వ్యక్తి

 

 

నమస్తే శేరిలింగంపల్లి: బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి మళ్ళీ తన స్వగ్రామం వెళ్తున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు. వివరాలు.. రెండు నెలల కిందట ఫల్చంద్ మాంజీ(39) తన చుట్టుప్రక్క గ్రామస్తులతో కలసి తన రాష్ట్రం జార్ఖండ్ నుండి హైదరాబాద్ కు వచ్చి యూసుఫ్ గూడలో సివిల్ కాంట్రాక్టర్ తన మేనమామతరుణ్ ప్రసాద్ మండల్ (41) వద్ద పని చేయడం ప్రారంభించాడు. 10 రోజుల తర్వాత రాయదుర్గం Knowledge City లోని Star Bucks Companyలో పని చేస్తున్న సమయంలో ఆగస్ట్ 29న తన తోటి సిబ్బందితో నేను మా ఇంటికి వెళ్లిపోతున్న అని చెప్పి అదృశ్యమయ్యాడు. దీంతో తరుణ్ అతని కుటుంబ సభ్యులకు కాల్ చేయగా ఇంకా రాలేదని చెప్పడంతో 1వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

అదృశ్యమైన ఫల్చంద్ మాంజీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here