శిల్పారామంలో మహిళల కోసం ప్రత్యేక మేళా – ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు

భారత నాట్య ప్రదర్శనలో యువతులు

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో  “అల్ ఇండియా  సారీ మేళ ” ని శుక్రవారం స్పెషల్ ఆఫీసర్ శిల్పారామం జి. కిషన్ రావు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ మహిళల కోసం  ప్రత్యేకంగా  ఏర్పాటు చేసే  చేనేత చీరల మేళ ఈ సంవత్సరం  బతుకమ్మ పండగ కోసం  ముందుగా ఏర్పాటు చేసి ఇరవై రోజులు సందర్శకులకు అందుబాటులో ఉండే  విధంగా  ఏర్పాటు చేసామని  ప్రత్యేక అధికారి కిషన్ రావు  తెలిపారు.  వివిధ రాష్ట్రాలనుండి ఎంతో ప్రశస్తమైన  చీరలను  మంచి రంగులలో మహిళలని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. దాదాపుగా 65 స్టాల్ల్స్ నూతనంగా ఏర్పాటు చేసారు. రాజస్థాన్  నుండి కోట,  జైపూర్  కాటన్ చీరలు. బీహార్ నుండి టుస్సార్, భాగల్పూరి చీరలు, ఆంధ్రప్రదేశ్ నుండి చీరాల , కలంకారీ, వేంకటగిరి, ఉప్పాడ, పేటేరు, మంగళగిరి, చీరలు, తెలంగాణ నుండి పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, గొల్లబామ చీరలు, మధ్యప్రదేశ్ నుండి బాతిక్ ప్రింట్ , చందేరి చీరలు, ఉత్తరప్రదేశ్  నుండి బనారసీ, వెస్టబెంగాళ్ నుండి జాంధానీ, టస్సార్,  బెంగాలీ కాటన్ , పెయింటెడ్ చీరలు, ఒరిస్సా నుండి ఇక్కత్ చీరలు, గుజరాత్ నుండి బ్లాక్ ప్రింటింగ్ , హ్యాండ్ ఎంబ్రాయిడరీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్,  అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు సాయంత్రం యంపీ థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా భారతీయ కళా సంస్కృతి  ఆధ్వర్యం లో ప్రవీణ వాడపల్లి, శ్రీవిద్య కిదాంబి, అరుంధతి షెనాయ్, శైలశ్రీ, స్వప్న కృష్ణ మోహన్ , గౌతమి శిష్య బృందం చే కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఆధ్యంతం అలరించాయి.

మేళాను పరిశీలిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here