మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం మాదాపూర్‌లోని శిల్పారామాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గంగిరెద్దుల విన్యాసాలను, హరిదాసుల ఆట పాటలను చూసి అభినందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల శిష్య బృందంచే నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణపతి కౌతం, శ్రీ గణనాథమ్, పుష్పాంజలి, కొలువైఉన్నదెయ్, బ్రహ్మాంజలి, నమశ్శివాయతేయ్, అయిగిరినందిని అంశాలను ప్రదర్శించారు. బ్రాహ్మణి, సాద్వి, శ్రీ లాస్య, సాత్విక, శరణ్యలు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి మెప్పించారు.