- శేరిలింగంపల్లిలో నెలకొన్న సమస్యలపై చర్చ
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై జీహెచ్ఎంసీ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ, ఇతర అంశాలపై వారు చర్చించారు. ముఖ్యంగా వీధి దీపాలు, రోడ్ మార్కింగ్స్, సైన్ బోర్డుల ఏర్పాటు, జంక్షన్ డెవలప్‌మెంట్స్, ఫుట్‌పాత్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, వాటర్ లాగింగ్, డ్రైనేజీ, తాగునీటి లీకేజీ వంటి అంశాలపై చర్చించారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, ఈఈ చిన్నా రెడ్డి, డీఈ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీకాంత్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాస్, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహా రావు, మియాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుమన్ కుమార్, ఎన్‌సీసీ జనరల్ మేనేజర్ శివప్రసాద్, ఇతర జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.