- ఇద్దరు రష్యన్ యువతులు, ముగ్గురు మోడల్స్, ఒక విటుడు అదుపులోకి..?
నమస్తే శేరిలింగంపల్లి: హైటెక్ సిటీలోని ఓ స్టార్హోటల్లో కొనసాగుతున్నసెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. లొకాంటో యాప్ ద్వారా మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్లో వ్యభిచారం జరుగుతుందని సమచారం అందుకున్న యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీమ్ ఆకస్మిక దాడులు నిర్వహించగా కాగా రష్యా దేశానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు, ముంబై, పంజాబ్ కు చెందిన ముగ్గురు మోడల్స్ తో పాటు ఒక విటుడును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలుస్తుంది. మాదాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.