మాదాపూర్‌లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆద్వ‌ర్యంలో ఉగాది క‌వి స‌మ్మేళ‌నం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ని ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని మాదాపూర్ సాయినగర్ లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం లో మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వి.ఫణికుమార్ ఆధ్వర్యంలో కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసోసియేష‌న్‌ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ విచ్చేసి మాట్లాడుతూ తెలుగు సంవత్సరానికి ఆరంభం ఉగాది అని, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి సేవించడం, పంచాంగ శ్రవణం చేయటం ఆచారం అన్నారు. దేవాలయాల సందర్శన, కవిసమ్మేళనాలకు హాజరవటము మన సనాతన సంప్రదాయమ‌ని అన్నారు. ఈ రోజు వసంత ఋతువులోనికి అడుగిడే రోజు ఉగాది య‌ని, ఆనందముగా జీవించాలని ఆశిస్తూ మొదటిరోజున ఆనందముగా గడిపితే సంవత్సరాంతము ఈ తీపి గుర్తులతో ఉత్సాహంగా గడుస్తుందని ఆశిస్తూ ఉగాది వేడుకలు జరుపుకొంటామ‌ని అన్నారు. సంగీత సాహిత్యాలకు ఎక్కడ ఆదరణ ఉంటాదో ఆ ప్రాంతం అంతా సుభిక్షముగా ఉంటుందని పెద్దలంటారు. ఈ ఆచారంలో భాగంగా గానే ఈ కవిసమ్మేళనం నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా కవులు వివిధ సామాజిక అంశాలపై తమ కవితా గానాన్ని వినిపించారు. అనంత‌రం కవులను శాలువ , పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. ప్రజలందరికి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు సహదేవ్, గణపతి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాణి సాంబశివరావు, మల్లేష్, నల్లగొర్ల శ్రీనివాసరావు, పాలం శ్రీనివాస్, కవులు మావిశ్రీ మాణిక్యం, కృష్ణ గౌడ్, చమత్కార కవి కామేశ్వరరావు, ఎం.నారాయణరావు, రజనీ కులకర్ణి, మమత తదితరులు పాల్గొన్నారు.

స‌మ్మేళ‌నంలో పాల్గొన్న క‌వుల‌తో పాటు రామ‌స్వామి యాద‌వ్‌ను స‌న్మానిస్తున్న నిర్వాహ‌కుడు ఫ‌ణికుమార్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here