నమస్తే శేరిలింగంపల్లి: మానవ సమాజానికి కారల్ మార్క్స్ ఒక దిక్సూచి అని ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కామ్రేడ్ వి.తుకారాం నాయక్ అన్నారు. కారల్ మార్క్స్ 204 వ జయంతి సందర్భంగా మియాపూర్ లోని ఎంఏ నగర్ లో ఎంసీపీఐయూ మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. తుకారాం నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మార్క్స్ ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సమాజం మొత్తంలో శ్రమ దోపిడీ విధానాన్ని వెలుగు చూపిన గొప్ప శాస్త్రవేత్త అని అన్నారు. మార్క్స్ సైద్ధాంతిక విధానం శ్రమ దోపిడీ నుండి విముక్తి ఉందన్నారు. పెట్టుబడి దారీ వ్యవస్థ, సామ్రాజ్య విధానం పై శ్రామిక వర్గ సమీకరణ తో వర్గ, సామాజిక ఉద్యమాలు జరపాలని, సమానత్వంతో కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ఎంసీపీఐయూ పార్టీ వర్గ పోరాటాలు మార్క్స్ సైద్ధాంతిక విధానంతో, అంబేద్కర్ ఆలోచనల విధానంతో సామజిక పోరాటాలు చేస్తుందని అన్నారు. మానవ సమాజం సమానత్వమే మార్క్స్ విధానమని అన్నారు. దార లక్ష్మి అధ్యక్షత వహించగా ఏఐఎఫ్ డీడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి కుంభం సుకన్య, ఏఐఎఫ్ డీవై రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్, ఎంసీపీఐయూ డివిజన్ కార్యదర్శి కన్నా శ్రీనివాస్, డివిజన్ కమిటి సభ్యులు ఎం. రాణి, జి.లావణ్య, విమల, లలిత, ఈశ్వరమ్మ, డి. లక్ష్మీ, రాంచందర్, శరణప్పా, నరసింహ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.