నమస్తే శేరిలింగంపల్లి: రోడ్డు మద్యలో ఉన్న ఇనుప గ్రిల్స్ ను ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగాలాండ్ కు చెందిన బిమోల్ టిముంగ్(22), ఝల్‌హౌలీ రుస్తా అనే ఇద్దరు స్నేహితులు మాదాపూర్ లోని టిఫిన్ సెంటర్ లో మాస్టర్లుగా గత 45 రోజుల నుంచి పనిచేస్తున్నారు. ఈ నెల 3న ఉదయం మాదాపూర్ నుంచి గచ్చిబౌలి పీఎస్ సమీపంలోని గచ్చిబౌలి రాంకీ హోటల్‌కు టీఎస్ 09 ఈ ఎక్స్ 8813 నంబర్ గల తమ యాక్టివా బైక్‌పై వెళ్తున్నారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి సమీపంలోకి చేరుకోగానే స్కూటీ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న మీడియన్ గ్రిల్స్‌ను ఢీకొట్టారు. ఝల్‌హౌలీ రుస్తాకు స్వల్ప గాయలవగా బీమోల్ టిముంగ్ తలకు తీవ్ర గాయాలవడంతో పక్కనే ఉన్న కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతదేహానికి శవపరీక్ష చేయించి బంధువులకు అప్పగించగా అంత్య క్రియల కోసం స్వస్థలానికి తీసుకెళ్లారు. ఝల్‌హౌలీ రుస్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.