మియాపూర్, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని మాతృశ్రీనగర్ లో స్థానిక రెసిడెన్స్ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిచిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. చివరి రోజు పలువురు సాంస్కృతక కార్యక్రమాలను ప్రదర్శించి అలరించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో స్థానికంగా ఉన్న రుద్రరాజు సత్యనారాయణ రాజు అనే వ్యక్తి లడ్డూను రూ.6.40 లక్షలకు పాడి సొంతం చేసుకున్నారు.