ప్ర‌జ‌ల‌కు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నే ల‌క్ష్యం : ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

మియాపూర్‌, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌జ‌ల‌కు మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ అన్నారు. ఆదివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్న ఏలియన్స్ ఎలైట్స్ అపార్ట్మెంట్స్ లో మంజీర మంచినీటి పైప్ లైన్ పనులు పూర్తయిన సందర్భంగా అపార్ట్మెంట్ వాసులకు మంజీర మంచినీటి నల్లా కుళాయిని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు మంచి నీటి పైప్ లైన్ వేసి మంజీర మంచినీటి కుళాయిని ప్రారంభించ‌డం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.

మంచినీటి న‌ల్లాను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

ప్ర‌జ‌ల‌కు మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంలో క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని అన్నారు. ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొర‌వ‌తో శేరిలింగంప‌ల్లిని నంబ‌ర్ వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ప్ర‌తి ఇంటికి 20వేల లీట‌ర్ల ఉచిత నీటిని అందిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మారబోయిన రాజు యాదవ్, ప్రసాద్, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్ , సీహెచ్ రాజు యాదవ్, పవన్, ఏలియన్స్ ఎలైట్స్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు డింపి గోయల్, షమీ పౌల్, మాణిక్యం గౌడ్, కృష్ణ కూచిపూడి, ప్రవీణ్, సప్త రిషి, ఏ ఎస్ నారాయణ, సుమంత్, రాజన్ కుమార్, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

అపార్ట్‌మెంట్ వాసుల‌తో ఎమ్మెల్యే గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here