మాదాపూర్, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని అలేఖ్య హోమ్స్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ గంగుల రాధాకృష్ణ యాదవ్ ఆహ్వానం మేరకు శేరిలింగంపల్లి నియోజవర్గ బీజేపీ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్న ప్రసాదం స్వీకరించి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.