శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కాశీం వల్లి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలరామ్ యాదవ్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరామ్ యాదవ్ రూ.15వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి తోడుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






