శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): వరంగల్ జిల్లా మచ్చాపూర్ వద్ద నిర్మించిన ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్మారక స్తూపాన్ని మే 12న ప్రారంభించనున్నామని, ఈ సందర్భంగా నిర్వహించనున్న ఓంకార్ శతజయంతి ప్రారంభ సభకు ప్రజలు, ప్రజా తంత్ర వాదులు, మేథావులు, కవులు, కళాకారులు, విద్యార్థి, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభ గోడ పత్రికను మియాపూర్ ఎంఏ నగర్ లోని తాండ్ర రామచంద్రయ్య స్మారక భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు గడ్డం నాగార్జున, కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్ , పల్లె మురళి, అంగడి పుష్ప, కర్ర దానయ్య , డివిజన్ కమిటీ సభ్యులు లలిత, అరుణ, రజియా బేగం, జి శివాని, సుల్తానా బేగం, ఇసాక్, శ్రీను పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ శతజయంతి ప్రారంభ సభలో యంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్, ఆర్ యం పి ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగత్ రాం పాస్ల, శాసనసభ సభ్యుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు గోరెటి వెంకన్న, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ప్రముఖ కవులు కళాకారులు, జి జయరాజ్, యోచన, సిపిఐ యం యల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవి చలపతిరావు, ఇతర కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారని తెలిపారు.