మహాత్మా జ్యోతిరావు పూలేను యువ‌త ఆద‌ర్శంగా తీసుకోవాలి

  • ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్

మియాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద సేవా సంఘంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త అని అన్నారు. తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వాళ్ళ హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడ‌ని కొనియాడారు.

వివేకానంద సేవా సంఘంలో చిన్నారుల‌కు పండ్ల‌ను పంపిణీ చేస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్

అణగారిన వర్గాల సర్వతోముఖాభివృద్ధి కేవలం విద్య ద్వారానే అని భావించి ఈ వర్గాల అక్షరాస్యతకు కృషిచేసిన ధన్యజీవి అని అన్నారు. అనేక అనాథ‌ శరణాలయాలు స్థాపించడం, వితంతు వివాహాల‌ను ప్రోత్సహించిన గొప్ప మానవతా వాది అన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాల సంపూర్ణ అక్షరాస్యతకు కృషిచేస్తే తద్వారా ఈ వర్గాలు సర్వతోముఖాభివృద్ధి చెందడానికి వీలుకలుగుతుంద‌న్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు, వృద్దులకు పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, నల్లగొర్ల శ్రీనివాసరావు, రామ్మోహనరావు, జనార్దన్, పాలం శ్రీను, మహేశ్వర రెడ్డి, ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here