ప్ర‌తిప‌క్షాల‌కు ఓటు వేస్తే వృథానే : హ‌మీద్ ప‌టేల్

కొండాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యతను కల్పిస్తున్నారని కొండాపూర్ డివిజ‌న్ తెరాస కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి హ‌మీద్ ప‌టేల్ అన్నారు. శ‌నివారం డివిజ‌న్ ప‌రిధిలోని కొత్త‌గూడ గ్రామంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ తో క‌లిసి హ‌మీద్ పటేల్ ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. కారు గుర్తుకు ఓటు వేయాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు.

కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న హ‌మీద్ పటేల్‌, నీలం ర‌వీంద‌ర్ ముదిరాజ్
ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న హ‌మీద్ పటేల్‌, నీలం ర‌వీంద‌ర్ ముదిరాజ్

ఈ సంద‌ర్భంగా హ‌మీద్ పటేల్ మాట్లాడుతూ.. నిరుపేదలను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నది కేవలం తెరాస ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్‌ పేదల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కేవలం ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. వారి మాటలను నమ్మి ప్రజలు ఓటు వేస్తే అభివృద్ధికి దూరమైనట్లేనని అన్నారు. డిసెంబర్‌ 1న జరిగే పోలింగ్‌లో తెరాసకు ఓటు వేయాలన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here