శేరిలింగంపల్లి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు: రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ శ్రీశ్రీశ్రీ రామాలయంలో మహాశివరాత్రి ని పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తి పండితుల సమక్షంలో మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శివాలయంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలను చేశారు. ఈ సందర్భంగా రాగం నాగేంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలుండాలని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here