విద్యానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): బీసీల ఐకమత్యమే మహాబలం అని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడిగా భేరి రామచందర్ యాదవ్ ను ఆర్.కృష్ణయ్య నియమించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్‌కు కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లోనూ ఇంకా ప్రగతిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పించాలన్నారు. భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు కృష్ణయ్యకు కృతజ్ఞతల తెలుపుతున్నానన్నారు. బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కె యాదగిరి యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు నీలం వెంకటేష్ ముదిరాజ్, యూత్ ప్రధాన కార్యదర్శి చంటి, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.






