శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి జితేందర్ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎన్ పవన్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కుమ్మరి జితేందర్ మాట్లాడుతూ… పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు బీజేపీ, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా, శేరిలింగంపల్లి అసెంబ్లీ నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను నిర్వహించి పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

