నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ హారిక తెలిపిన వివరాల ప్రకారం… మాదాపూర్ రత్నదీప్ సూపర్‌మార్కెట్ ఎదురుగా బస్‌స్టాప్‌లో ఒక వ్యక్తి(35) మృతి చెంది పడి ఉండటాన్ని గుర్తించిన ప్రయాణికులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడు గురించి ఆరాతీశారు. స్థానికంగా భిక్షాటకుడిగా బావిస్తున్నారు. సహజంగానే మృతి చెంది ఉండవచ్చని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవఖానాకు తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు మాదాపూర్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ హారిక ఫోన్ నెంబర్ 9491030064లో సమాచారం ఇవ్వాలని సూచించారు.






