నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మాదాపూర్ డివిజన్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామేట్ లో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, అరుణోదయ కాలనీ, సైబర్ వ్యాలీ లో చేపటాల్సిన అభివృద్ధి పనులను ఏఈ ప్రశాంత్, స్థానిక నాయకులతో కలిసి స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సయ్యద్ గౌస్, ఖానామేట్ టీఆర్ఎస్ బస్తి కమిటీ అధ్యక్షులు సర్వర్, భాస్కర్, ప్రసాద్, వసంత్, దీపక్, నీలిమ తదితరులు పాల్గొన్నారు.