శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను స్థానిక కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు పరిశీలించారు. అలాగే శేరిలింగంపల్లిలో పలు చోట్ల నెలకొన్న సమస్యలను సైతం స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. మంజీరా రోడ్డు చాలా రోజుల నుంచి గుంతలు పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా నల్లగండ్లలో ఉన్న శేరిలింగంపల్లి మండల ఆరోగ్య కేంద్రంలో రోగులు, వైద్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.






