శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా శేరిలింగంపల్లికి చెందిన ఎం.సందీప్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవి అప్పగించినందుకు గాను ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కరానికి శ్రమిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సమీర్ కౌశల్, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి సమన్వయకర్త ఎం.రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.
