ఎమ్మెల్సీ క‌విత‌కు నాయ‌కుల శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ చింతకింది మహేందర్ గౌడ్, తెలంగాణరాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లు ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితను ఆమె నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినియోగదారుల హ‌క్కుల కోసం చేప‌డుతున్న‌ కార్యక్రమాలను గురించి కవితకి వారు వివరించారు. తాము చేస్తున్న కార్యక్రమాలకు బలాన్నిచ్చే విధంగా త‌మ‌కు మద్దతు కావాలని త‌మ‌ కార్యక్రమాలలో క‌విత‌ భాగస్వామ్యం ఉండాలని ఆమెను వారు కోరారు.

ఎమ్మెల్సీ క‌విత‌కు నూత‌న సంవ‌త్సర శుభాకాంక్ష‌లు తెలుపుతున్న చింతకింది మహేందర్ గౌడ్, డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి నాయకులు…
నూతన సంవత్సరం సందర్బంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు ప్రొ.పి.వై.రమేష్, రంజిత్ అన్న యువజన అధ్యక్షుడు ఆశీల శివ, ప్రొ.రవీందర్ కొరని, ఆర్ఎంపీపిఎమ్పి రాష్ట్ర జనరల్ సెక్రటరీ డా.రమేష్, ఉద్యమ నాయకుడు జీవానందంలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎమ్మెల్సీ క‌విత‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here