శిల్పారామంలో కూచిపూడి కళా విభావరి

శేరిలింగంప‌ల్లి, మే 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శిల్పారామంలో బుధవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్ నుండి వ‌చ్చిన నాట్య గురువు శాంతి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా గణేశ‌ కౌతం, సూర్యాష్టకం, తాండవమాడెను శివుడు, అన్నయ్య సంకీర్తనలు, గణేశా పంచరత్న, తారంగం, గోవింద‌ నామాలు, జయ జయ దుర్గే, దేవా దేవాంభజే, మంగళం వంటి ఆధ్యాత్మిక, సాంప్రదాయ నృత్యాంశాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భవిష్య, మహాసేన, నిత్య, వైష్ణవి, లక్ష్య, లాస్యశ్రీ, తన్విక, శ్రీమాన్య, లలిత, మహతి, యశ్వి తదితర కళాకారులు తమ నృత్య ప్రతిభతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమం మొత్తం సాంప్రదాయ కళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ సాగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here