నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా హైటెక్స్ లో ఈ నెల 25న నిర్వహించే పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. ఆరు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఉండడంతో అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా కమిటీల సభ్యులు సంబంధిత ఇంచార్జీలకు సూచించారు. ప్లీనరీ సమావేశంలో హాజరయ్యే ప్రతినిధుల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే వారి కోసం అన్ని ఏర్పాట్లను నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేయాలని, అందుకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ సుధాంష్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ఈఈ శ్రీకాంతిని, డీఈ సరిత, ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ డీజీఎం నారాయణ, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు గోవర్దన్ రెడ్డి, భాస్కర్, దొంతి శేఖర్, రఘునాథ్, గౌస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.