కొండా విజయ్ సేవలు అభినందనీయం: ప్రభుత్వ విప్ గాంధీ

  • పుట్టిన రోజున పేద కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయం

నమస్తే శేరిలింగంపల్లి: హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడాకాలనీకి చెందిన వాచ్ మెన్‌ గిరి కూతురు అరుణకు ఇటీవల చేతికి బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కొండా విజయ్ జన్మదినం సందర్భంగా పేద కుటుంబానికి అండగా‌ నిలవడం గర్వకారణమన్నారు. సామాజిక సేవలో ఎప్పటికప్పుడు ముందుండి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న కొండా విజయ్ ను గాంధీ అభినందించారు. ప్రతి ఒక్కరు కొండా విజయ్ ను ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

పేద కుటుంబానికి హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here