నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మధురానగర్, గంగారం, చందానగర్ , మాదాపూర్, కొండాపూర్ వివిధ గణేష్ మండపాల గణనాథులను , బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో వినాయక చవితి ఒకటని అనేక ప్రాంతాలలో వినాయక చవితిని తరతరాలుగా జరుపుకుంటూనే వున్నారన్నారు. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా చైనా, నేపాల్ వంటి వివిధ దేశాలలో కూడా వినాయకుడిని పూజించడం జరుగుతుందన్నారు. ఏ శుభకార్యాలు అయినా యజ్ఞయాగాదులు అయినా మొదలు పెట్టాలంటే కచ్చితంగా మొదట వినాయకుడి పూజ చేయాలని తెలియజేస్తూ గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.