క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క్రిస్మస్ పర్వదినం సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలోని హోరేబు మినిస్ట్రీస్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చర్చి నిర్వాహకులు సాయిబాబాని శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి చిన్నారులకు క్రిస్మస్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో చర్చి నిర్వాహకులు సురేష్ , సుధీర్ , పాస్టర్ సందీప్, నాయకులు దారుగుపల్లి నరేష్, శామ్లెట్ శ్రీనివాస్‌, నంది రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here