శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో మయూరి నగర్, దోవ కాలనీల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్డి సంఘం కార్తీక మాస వన భోజన మహోత్సవంలో PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రెడ్డి సంఘం సభ్యులు ఐక్యతగా ఉండాలన్నారు. అందరూ కలసి మెలసి తమ సమస్యల పరిష్కారానికి పోరాడాలని, అందరూ సోదరభావంతో మెలగాలని అన్నారు. వారికి అవసరం అయిన సహాయ సహకారాలు అందజేస్తానని, ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా ఉంటామని తెలిపారు.