- కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని వరద బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తీలో వరద ముంపు ప్రభావిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ప్రశాంత్, రెవెన్యూశాఖ అధికారులు ఆనంద్, రాజశేఖర్ పాల్గొన్నారు.